దేవర కాదు దేవరకొండ వస్తున్నాడు..!

shami
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ రిలీజ్ లాక్ చేశారు. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో మృణాల్ ఠాకూర్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. విజయ్ తో పరశురాం కలిసి చేసిన గీతా గోవిందం సినిమా సూపర్ హిట్ కాగా కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ పై కూడా భారీ హైప్ ఉంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ లో బీభత్సమైన క్రేజ్ ఉంటుంది.
విజయ్ దేవరకొండ మృణాల్ ఈ కాంబో సినిమాకు హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లు కన్ ఫ్యూజన్ కొనసాగా లేటెస్ట్ గా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. కొద్దిరోజులుగా డిస్కషన్స్ లో ఉన్నట్టుగానే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు.
అసలైతే ఏప్రిల్ 5న ఎన్.టి.ఆర్ దేవర రిలీజ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని తెలిసి దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ని ఆ ప్లేస్ లో రిలీజ్ చేస్తున్నాడు. దేవర బదులుగా దేవరకొండ సినిమా వస్తుంది. దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఐరనే వంచాలా ఏంటి అన్న టీజర్ సినిమాపై మరింత అంచనాలు చేసింది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ, పరశురాం మరో సూపర్ హిత్ టార్గెట్ పెట్టుకున్నారు. మరి సినిమా ఆ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

దిల్ రాజు ఈ సినిమాను సంక్రాంతికే వదలాలని అనుకున్నా సంక్రాంతి సినిమాల ఫైట్ లో ఈ సినిమా పోటీ ఎందుకని సైడ్ చేశాడు. ఫైనల్ గా సమ్మర్ రేసులో మొదటి సినిమాగా ఇది వస్తుంది. ఏప్రిల్ 5న రిలీజవుతున్న ఈ సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికిందని చెప్పొచ్చు. ఖుషితో జస్ట్ ఓకే అనిపించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గురి పెట్టాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: