వామ్మో: రూ.300 కోట్ల చేరువగా హనుమాన్ మూవీ.. ఎన్ని కోట్ల లాభమంటే..!!

Divya
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హీరోయిన్గా అమృత అయ్యర్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలు నటించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 రోజులు అవుతున్న ఎన్ని కోట్లు రాబట్టిందని విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు వాటి గురించి చూద్దాం.


హనుమాన్ సినిమా ఇండియా లో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు హిందీలో దాదాపుగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. కన్నడ తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా బాగానే రెస్పాన్స్ అందుకుంది ఇక రెండోవారం ఈ సినిమా రూ .59 కోట్ల రూపాయలను కలెక్షన్స్ రాబట్టింది. రెండోవారానికి రూ .160 కోట్లు ఇండియాలో రాబట్టింది. ఇక మూడవ వారంలో మొత్తం మీద రూ .150 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది.


ఇక హనుమాన్ సినిమా 21 వ రోజున కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియాలో కోటి రూపాయలు రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా రూ .2.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా రూ .300 కోట్ల రూపాయల టార్గెట్ ని చేరువయే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.275 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రూ.140 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ తో  హనుమాన్ సినిమా ముందుకు వెళ్తోంది. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బిజినెస్ పరంగా రూ.28 కోట్ల రూపాయలు జరగకగా ఇప్పటికే ఈ సినిమా రూ.110 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: