గేమ్ ఆన్ మూవీ రివ్యూ.. అదిరిన కాన్సెప్ట్

Anilkumar
గేమ్ ఆన్ ట్రైలర్, టీజర్ చూస్తే సినిమా ఏంటన్నది సరిగ్గా అర్థం కాదు. ప్రమోషన్స్‌లోనూ హీరో, దర్శకులు ఇదే చెప్పారు. సినిమాలో చాలా పాయింట్లు దాచామని అన్నారు. ఇదొక మదర్ అండ్ సన్ సెంటిమెంట్ అని సినిమా చూశాక తెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌లోకి గేమింగ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ మూవీ కథ, కథనాలు ఏంటి? కొత్త దర్శకుడు దయానంద్ ఈ చిత్రాన్ని ఎలా తీశాడు? హీరో గీతానంద్ ఎలా నటించాడు? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
సిద్దార్థ్ (గీతానంద్) గేమింగ్ కంపెనీలో పని చేస్తాడు. కానీ ఎప్పుడూ నిరాశ, నిస్పృహతో, భయంభయంగా బతుకుతుంటాడు. అతడికి తన ఫ్రెండ్ రాహుల్ (కిరీటీ), ప్రేయసి మోక్ష (వాసంతి)లే లోకం.  కానీ ఈ ఇద్దరూ కలిసి సిద్దార్థ్‌ను మోసం చేస్తారు. దీంతో చావే తనకు దిక్కని అనుకుంటాడు. అలాంటి టైంలోనే సైక్రియార్టిస్ట్ మదన్ మోహన్ (ఆదిత్య మీనన్) గేమ్ స్టార్ట్ చేస్తాడు. లూజర్ అనే ఫీలింగ్‌లో ఉన్న సిద్దార్థ్‌ను టాస్కులు ఇచ్చి విన్నర్‌గా మారుస్తాడు. అయితే ఈ టాస్కుల వల్ల చివరకు చిక్కుల్లో పడతాడు సిద్దార్థ్. అసలు సిద్దార్థ్‌కు మదన్ మోహన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ టాస్కులోకి సిద్దార్థ్ ఎలా వస్తాడు? సిద్దార్థ్‌కి అమ్మ అర్చన (మధుబాల) అంటే ఎందుకు అంత ద్వేషం? సిద్దార్థ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
గీతానంద్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. భయస్తుడిగా, కాన్పిడెన్స్ లేని వాడిగా, లూజర్‌గా నటించి మెప్పించాడు. సెకండాఫ్‌లో ధైర్య వంతుడిగా, విన్నర్, ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న వ్యక్తిలా అదరగొట్టేశాడు. ఆ రెండు వేరియేషన్స్ చూపించాడు. డ్యాన్సులు, యాక్టింగ్, రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నింట్లోనూ అదరగొట్టేశాడు. వాసంతి కనిపించినంత సేపు అందంతో ఆకట్టుకుంది. నేహా సోలంకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆదిత్య మీనన్ విలనిజం బాగుంది. మధుబాల పాత్ర కాస్త ఎమోషనల్‌గా సాగింది. శుభలేఖ సుధాకర్ తన అనుభవంతో ఆ పాత్రను అవలీలగా చేసేశాడు. కిరిటీ, ఇతర పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ
గేమ్ ఆన్ పాయింట్ ఇది వరకు చూసి ఉంటాం. పాత పాయింట్ అయినా దర్శకుడు చాలా కొత్తగా చూపించాడు. ఈ తరానికి తగ్గట్టుగా, ఈ జనరేషన్ యూత్ ఎలా చూడాలనుకుంటుందో అలా చూపించాడు. తల్లిని ద్వేషించే కొడుకు.. చివరకు తల్లి ప్రేమను అర్థం చేసుకుని దగ్గరయ్యే కొడుకు కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ గేమ్ ఆన్ మాత్రం చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అసలు ఇదొక మదర్ సెంటిమెంట్ సినిమా అని సెకండాఫ్‌లో అర్థం అవుతంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా సరదా సరదాగా సాగుతుంది. హీరో డౌన్ ఫాల్ అవ్వడం, టాస్కులతో మళ్లీ రైజ్ అవ్వడం, జల్సాలు చేస్తుండటం, హీరోయిన్‌తో ఆట పాటలు అంతా చక్కగానే సాగుతుంది. ఇంటర్వెల్‌కు కథ టోన్ మారుతంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఊహకందేలా సాగుతుంది. కానీ ఎంగేజింగ్‌గా సాగుతుంది. దీంతో ఓ కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతికంగా ఈ చిత్రం మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అందరినీ ఊపేస్తుంది. ఆర్ఆర్‌తో మనం కూడా పరుగులుపెట్టినట్టు అనిపిస్తుంది. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల గుర్తుండిపోతాయి. ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా బోర్ కొట్టించలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. మొదటి సినిమానే అయినా ఎంతో చక్కగా నిర్మించారు. ఫ్రేమ్స్ అన్నీ కూడా రిచ్‌గానే కనిపిస్తాయి.
రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: