'విశ్వంభర' కోసం మెగాస్టార్ భారీ కసరత్తులు

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక ఇప్పుడు 'విశ్వంభర' సెట్స్ లో అడుగుపెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా కోసం భారీ కసరత్తులు మొదలుపెట్టారు.'విశ్వంభర' సినిమా కోసం మెగాస్టార్ జిమ్ లో కసరతులు చేస్తున్న వర్కౌట్ వీడియోని  పంచుకున్నారు. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ఏజ్ లో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.  ఇక ఈ వీడియో చివర్లో చిరంజీవి 'గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అంటూ ఫుల్ జోష్ లో చెప్పారు. ప్రస్తుతం మెగాస్టార్ వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.'విశ్వంభర' మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ఉండబోతోంది. ఈ షెడ్యూల్ లోనే మెగాస్టార్ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాదులో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఓ భారీ సెట్ వేసినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. 

గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఇందులో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. ఇప్పుడు శింబు కూడా 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: