హీరోగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ అమర్ దీప్.. హీరోయిన్ ఎవరంటే..!?

Anilkumar
బుల్లితెర  నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ దీప్ చౌదరి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే తెలుగులో పలు సీరియల్స్ నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో మంది ప్రేక్షకుల ప్రేమ పొందడు ఈ నటుడు. అలా చివరి వరకు గెలుస్తాడు అని అనుకున్నా అమర్ దీప్ చివరిగా రన్నర్ అప్ గా నిలిచాడు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఈ నటుడు చేసిన రచ్చ ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం కెరియర్ పరంగా బాగా బిజీగా అయ్యాడు.

మళ్ళీ ఇప్పుడు పలు రకాల సీరియల్స్ లో బిజీ అవ్వాలి అని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన అభిమానులకి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అమర్ దీప్. అదేమిటంటే హీరోగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నాడు. అయితే అమర్ దీప్ సరసన నటించే హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ముద్దుల కూతురు సుప్రీత. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. సుప్రీత గురించి కూడా మనందరికీ తెలిసిందే. సురేఖ వాణి కూతురుగా ఈమె భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తల్లీ కూతురు ఇద్దరుహాట్ హాట్ డ్రస్ లతో,ఇన్ స్టా రీల్స్ స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులర్ అయిపోయారు. ఇక ఈ సినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నం.2 పూజ కార్యక్రమం నేడు అనగా ఫిబ్రవరి1 న ఉదయం 10 గంటలకి ప్రసాద్ ల్యాబ్ , హైదరాబాద్ లో జరుగుతుంది అని ప్రకటించారు. కాగా ఈ సినిమా M3 మీడియా బ్యానర్లో,మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: