దిల్ రాజు వారసుడి పెళ్లి!

Anilkumar
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు సోదరుడి కొడుకు హీరో ఆశిష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక అందుకు సంబంధించి కుటుంబ సభ్యులు పెళ్లి పనులను మొదలు పెట్టేసారు. గత ఏడాది నవంబర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆశిష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆంధ్రపదేశ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన అద్విత రెడ్డిని ఆశిష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా చేసుకున్న ఈ జంట పెళ్లి మాత్రం ఎంతో గ్రాండ్ గా చేసుకోబోతున్నరు. ఈ క్రమంలోనే దిల్ రాజు వారసుడి పెళ్లి కావడంతో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు

అందరిని ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇక తన సోదరుడి కొడుకు పెళ్లి బాధ్యతలను దిల్ రాజు స్వయంగా దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను ఒక్కొక్కరిగా కలిసి ఆహ్వాన పత్రికను అందిస్తూ వస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి మొదటి పెళ్లి పత్రికను అందజేసిన దిల్ రాజు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారు. ఈ సందర్భంగా పెళ్లి శుభలేఖను దిల్ రాజు, శిరీష్ కలిసి ఎన్టీఆర్ కి అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఆశిష్, అద్విత రెడ్డి ల పెళ్లి ఫిబ్రవరి 14న జైపూర్ లో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఆశిష్ సినిమాల విషయానికొస్తే.. దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలో తన స్టైల్, ఆటిట్యూడ్, యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే సినిమా చేస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు కాశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఆశిష్ మూడో సినిమా అరుణ్ అనే డెబ్యూ డైరెక్టర్ తో ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: