తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన ఆఖరుగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ప్రముఖ కథా రచయిత , దర్శకుడు మరియు నటుడు అయినటువంటి వక్కంతం వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లాంజ్ కూడా వసూలు చేయలేక భారీ డిజాస్టర్ ను అందుకుంది.
ఇకపోతే ప్రస్తుతం నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ సినిమాలోనూ ... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమా లకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇకపోతే ఇలా రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే నితిన్ మరో సినిమాను కూడా సెట్ చేసుకున్నాడు.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా శివాజీ ప్రధాన పాత్రలో 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనికి ఆదిత్య హసన్ దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితం నుండి ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నితిన్ తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు దీనిని శ్రేష్ట మూవీస్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.