హృతిక్ రోషన్ కెరీర్లో రూ.100కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు

Anilkumar
బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన తాజా చిత్రం 'ఫైటర్'. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో ఫైటర్ పై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయగా ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.హృతిక్ రోషన్ 'ఫైటర్' మూవీ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే సమయంలో రిలీజ్ అయి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హ్యాట్రిక్ మూవీగా 'ఫైటర్' నిలిచింది. మొదటి రోజు రూ.40 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో  దూసుకుపోతోంది.హృతిక్ రోషన్ కెరియర్లో వరుసగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన పదో సినిమాగా 'ఫైటర్' రికార్డ్ క్రియేట్ చేసుకుంది  ఈ పది సినిమాలన్నీ తక్కువ సమయంలో ఈ ఘనతను సాధించాయి. 2001లో 'కభీ ఖుషి కభీ ఘమ్' సినిమా హృతిక్ కెరియర్ లో మొదటిసారి రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.  
హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే ప్లాన్ చేశారు. ఈ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఈ ఫ్రాంచైజీ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ భాగం కానున్నట్లు సమాచారం.ఫైటర్ తర్వాత హృతిక్ రోషన్ 'వార్ 2'మూవీ చేస్తున్నాడు. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా 'వార్ 2' తెరకెక్కుతోంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇందులో మరో లీడ్ రోల్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: