ప్రభాస్ పక్కన ఆ హీరోయినా.. వద్దే వద్దంటున్న ఫ్యాన్స్?

praveen
ప్రస్తుతం పాన్ ఇండియా  రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఇక వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతమైన ఈ టాలీవుడ్ డార్లింగ్.. ఇటీవలే సలార్ అనే మూవీతో ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు అనే విషయం తెలిసిందే. ప్రశాంత నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్,కి మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇక ఈ మూవీస్ ని కూడా వెంటవెంటనే విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్.

 అయితే ఈ సినిమాలో పూర్తయిన తర్వాత మరికొంతమంది డైరెక్టర్లు కూడా ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లిస్టులో ఉన్నారు అని చెప్పాలి. కాగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఇక ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్న శ్రీలీలను  ప్రభాస్ మూవీ లో తీసుకోవాలని హను రాఘవపూడి అనుకున్నాడట.

 అయితే కథ ప్రకారం హీరో హీరోయిన్ కి సినిమాలో హైట్ వేరియేషన్స్ చాలా ఉంటుందట. ఈ హైట్ వేరియేషన్ పై కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయట. ఆ కారణంతోనే ఇక ప్రభాస్ తో పోల్చి చూస్తే కాస్త హైట్ తక్కువగా ఉండే శ్రీ లీలను  హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాడట హను రాఘవపూడి. అయితే ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్యూటీ పక్కన మా ప్రభాస్ అన్నను చూడాలా వామ్మో వద్దు బాబోయ్ వద్దు అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడే కాదు మొదటి నుంచి ప్రభాస్ కి జోడిగా శ్రీ లీలా అంటే ఎందుకో ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. గతంలో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలోను శ్రీ లీల నటించబోతుంది అంటూ ప్రచారం జరిగగా.. అప్పుడు కూడా ఇదే విధంగా మండిపడ్డారు. ఇక ఇప్పుడు హను రాఘవపూడి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: