మెగాస్టార్ తో అలాంటి సినిమాలు చేయమని అప్రోచ్ అయ్యేవాళ్ళు :: అల్లు అరవింద్
జంధ్యాల అంటేనే కామెడీ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. అయితే పూర్తిస్థాయి కామెడీతో చిరంజీవి అభినయంతోనే హావభావాలతోనే ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం ఒక ప్రయోగాత్మకంగా విజయాన్ని సాధించింది. హిట్టయితే కొట్టింది కానీ ఈ సినిమా ప్రభావం చిరంజీవి బాగా పడింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాట్లాడుతూ చంటబ్బాయి చిత్రం విజయం సాధించిన అది చిరంజీవికి మాత్రం కష్టాలను తెచ్చి పెట్టిందని ఈ సినిమా తర్వాత అందరూ కామెడీ లేదా సెంటిమెంటు తరహా సినిమాలనే చేయాలని ఆయనను అప్రోచ్ అయ్యే వారని అలా సినిమా తీయడం ఇష్టం లేని చిరంజీవి దాదాపు 6 నెలల వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కానీ చంటబ్బాయి సినిమా చేసినందుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదు అని అదొక ప్రయోగాత్మక చిత్రంగానే భావించారని తెలిపారు. చిరంజీవి కమర్షియల్ సినిమాల్లో హీరోగా ఉండాలని ఆ తర్వాత కామెడీ తరహా ఎక్స్పరిమెంట్స్ చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారని అల్లు అరవింద్ తెలిపారు.