'ఇండియన్ 2 ..నిరాశపరిచిన డైరెక్టర్..!?

Anilkumar
సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ విశ్వ నటుడు కమలహాసన్ కాంబినేషన్లో ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.    ఈ సినిమా షూటింగ్ పలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేశారు. దాంతో శంకర్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' షూటింగ్ ని మొదలుపెట్టారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత 'భారతీయుడు 2' షూటింగ్ పట్టాలెక్కించారు. 

అలా పలుమార్లు షూటింగ్ కి అంతరాయం కలుగుతూ వచ్చిన 'ఇండియన్ 2'కి ఇటు రిలీజ్ విషయంలోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఓవైపు కమల్ హాసన్ తో ఈ సినిమా తెరకెక్కిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారు. ఈ రెండు సినిమాలకు సమానంగా డేట్స్ కేటాయించారు. రీసెంట్ గానే 'ఇండియన్ 2' విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించగా.. రిపబ్లిక్ డే రోజు 'ఇండియన్ 2' రిలీజ్ డేట్ అప్ డేట్ వస్తుందని ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ఆశించారు.

కానీ శంకర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మరోసారి నిరాశపరిచాడు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇలా చేయడం నిజంగా ఆశ్చర్యమే. ప్రస్తుతం ఆయన నుంచి మూడు సినిమాలు రావాల్సి ఉంది. అది కూడా సంవత్సరం గ్యాప్ లో. ముందు ఇండియన్ 2 రిలీజ్ చేశాక గేమ్ చేంజర్, ఇండియన్ 3 ప్రాజెక్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో 'ఇండియన్ 2' ని వేసవికి విడుదల చేసి ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్' ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ముందు ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో కూడా క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: