బ్రదర్ గా ఉన్న అమర్ దీప్ బావ అయ్యాడు.. కష్టంగా అనిపించింది?

praveen
తెలుగు బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని కొన్ని సార్లు సీరియల్స్ కు ఉండే క్రేజ్ అటు భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది అని ప్రతిరోజు సీరియల్ మిస్ అవ్వకుండా చూసే ఆడియన్స్ ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది. రొటీన్ ఎమోషన్ అయినప్పటికీ ఎందుకో చాలా సీరియల్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇలా సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన విష్ణు ప్రియ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

 జానకి కలగనలేదు అనే సీరియల్ లో ఒక కీలకపాత్రలో నటించింది. ఇక తెలుగు పరీక్షకులకు దగ్గరయింది. అయితే సీరియల్ నటుడు సిద్ధార్థ్ వర్మనీ ప్రేమించి పెళ్లి చేసుకుంది విష్ణు ప్రియ. ఇక ఎన్నో బుల్లితెర కార్యక్రమాలపై వివిధ సీరియల్స్ లో కూడా సందడి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఏకంగా రియల్ లైఫ్ లో బ్రదర్ గా ఉన్న నటుడు అమరదీప్ చివరికి బావగా మారిపోయాడు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది. అమర్ దీప్ గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అమర్ నాకంటే వయసులో పెద్ద.. కానీ నన్ను అక్క అని పిలుస్తాడు.

 నేను కూడా వాడిని తమ్ముడు లాగానే చూసుకుంటాను. అమర్ తన పెళ్లి కార్డును మొదట నాకే ఇచ్చాడు. వాడి పెళ్లి పనులు నేనే దగ్గరుండి చూసుకున్నాను. అయితే జానకి కలగనలేదు అనే సీరియల్ లో మాత్రం అమర్ ను బావగారు అని పిలవాల్సి వచ్చింది. బ్రదర్ గా ఉండేవాడు అతడు బావ అయ్యే సరికి అలా పిలవడం కాస్త కష్టంగా అనిపించింది. అమర్ చాలా కష్టపడతాడు అనుకున్నది సాధిస్తాడు. నా లైఫ్ లో బెస్ట్ అమర్. దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: