'యానిమల్' విలన్ బాబి డియోల్ భార్యకు.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

praveen
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సినిమా యానిమల్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అని చెప్పాలి.

 ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యానిమల్ మేనియాలోనే మునిగి తేలారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కి కూడా రాబోతుంది అని చెప్పాలి. కాగా యానిమల్ మూవీ లో బాబి డియోల్ ఒక క్రూరమైన విలన్ పాత్రలో నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే యానిమల్ మూవీ తర్వాత బాబి డియోల్ కి మరిన్ని అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక యానిమల్ విలన్ బాబి డియోల్ వివరాలను ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు.

 కాగా బాబీ డియోల్ భార్య బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అతని భార్య పేరు తానియా. ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర కుమార్తె ఆమె. ఓ పార్టీలో ఆమెను చూసిన బాబి డియోల్ మనసు పారేసుకున్నాడట. అంతేకాదు ఇక తానీయాను ప్రేమలోకి దింపడంలో విజయం సాధించాడు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వివాహానికి ముందే తానియా ఇంటీరియర్ డిజైనర్ గా బాగా పాపులర్ అయింది. 2010లో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తానియా తీసుకుంది. ఇక తండ్రి ఆస్తులని ఆమెకు బదిలీ కావడంతో దాదాపు 300 కోట్లకు ఆమె యజమానిగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: