'చంద్రముఖి'లో ఈ చిన్నారి.. ఇప్పుడు బుల్లితెరపై హీరోయిన్ తెలుసా?

praveen
సాదరణంగా చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రేక్షకులను అలరించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నవారు ఇక ఆ తర్వాత పెరిగి పెద్దయి ఏకంగా హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో ఎన్నో రోజులుగా జరుగుతూ వస్తుంది. అయితే నేటి తరంలో కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరీ కొడుకు ఆకాష్, తేజ సజ్జా, కావ్య లాంటివారు ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించినవారు.. ఎవరైనా హీరో హీరోయిన్లుగా మారారు అంటే చాలు ఇక వారికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక అప్పుడెప్పుడో రజనీకాంత్ చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఇలాగే మారిపోయింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో క్యూట్ గా ఉన్న చిన్నారి ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ రేంజ్ అందంగా మారిపోయింది. జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్ కీలకపాత్రలో ఇక రజనీకాంత్ ప్రథమ పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఈ సినిమాలో అత్తిందో అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ పాటలో కనిపించే చిన్నారి బొద్దుగా రజినితో పాటు పాట పాడేస్తూ ఉంటుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. అయితే బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ చంద్రముఖి తర్వాత మాత్రం వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫొటోస్ తెగ వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. 18 ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తుంది. అయితే తనకు 2021 లోనే వివాహం జరిగింది. 2022 ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. కాగా ఇటీవలే ఆమె పెద్దయిన వీడియోని పోస్ట్ చేయగా ఆమె వెండితెర హీరోయిన్ కు తక్కువ బుల్లితెర హీరోయిన్ కు ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: