రొమాంటిక్ పాత్రలంటే ఇష్టం.. అందుకే అలాంటివి చేయాలని ఉంది : మృనాల్

praveen
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృనాల్ ఠాగూర్. ఇప్పటికే తన అందం అభినయంతో ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ అందరికుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. సీతారామం అనే సినిమాలో సీత అనే ఒక అద్భుతమైన పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా బాగా దగ్గర అయింది మృనాల్ ఠాగూర్.

 అప్పటివరకు ఈ హీరోయిన్ పెద్దగా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సీతారామం సినిమా తర్వాత ఇక ఆమెను అభిమానించడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది మృనాల్ ఠాగూర్. మొన్నటికి మొన్న నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమాలో మృనాల్ ఠాగూర్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. అటు ఓటీటిలో బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా సిద్ధమవుతుంది.

 అయితే ఇటీవలే తాను ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మృనాల్ ఠాగూర్. తనకు ఎక్కువగా రొమాంటిక్ ప్రేమ కథ సినిమాల్లో నటించాలని ఉంది అంటూ  మనసులో మాటను బయటపెట్టింది. అయితే బాలీవుడ్ లో చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ వాటిలో రొమాంటిక్ ప్రేమ కథ చిత్రాలు ఒకటి కూడా లేవు. పెద్ద సినిమాలు రావడం లేదు. బహుశా నేను ఇంకా అక్కడ ఫేమస్ కాలేదేమో. ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఇష్టం లేదు అన్నట్లుగానే చూస్తారు. కానీ దొంగ చాటుగా అలాంటి సినిమాలనే చూస్తారు అంటూ మృణాలు ఠాగూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: