కల్కి 2898 AD: అంచనాలు అందుకుంటుందా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా కల్కి 2898 AD.ఈ మూవీ విడుదల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ ని మూవీ యూనిట్ ఈ మే 9కి లాక్ చేశారు. లాస్ట్ ఇయర్ సమ్మర్ కి టాప్ హీరో సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతున్న పెద్ద హీరో సినిమా ఇదే. ఈ సమ్మర్ కి రావాల్సిన దేవర సినిమా కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో టాప్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ కి రాబోతున్నాడు. కల్కి 2898 సినిమాలో తమిళ సీనియర్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి బీబీగ్ స్టార్స్ నటిస్తుండడంతో పాటుగా ఈ మూవీని హాలీవుడ్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తుండడంతో సినిమాపై హైప్ ఆకాశాన్ని అంటింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మారుతున్నా కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడింది అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.



ఇక ఇది వరకే జనవరి 12న రావాల్సిన ఈ సినిమా మే 9కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా మారింది అంటూ కొన్ని వార్తలు నిన్న స్టార్ట్ కాగా దీనిపై కొన్ని  వర్గాలు అప్డేట్ అందిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కల్కి చిత్రం అనుకున్నట్టుగా మే లోనే విడుదల అవుతుంది అని చెబుతున్నారు.ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కాగా గ్రాఫిక్ పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. దీంతో మే 9 న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇంకా ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ చిత్రంలో దీపికా పదుకొనె అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కూడా నటిస్తున్నారు. బాహుబలి 2 తరువాత ప్రభాస్ సరైన హిట్టు లేదు. సలార్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కానీ లాంగ్ రన్ లో 30 శాతం పైగా నష్టాలు తెచ్చిపెట్టింది.ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అన్ని ఆశలు కూడా ఈ మూవీ పైనే ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: