సీక్వెల్ మూవీపై కన్సంట్రేట్ పెట్టిన కోలీవుడ్ స్టార్....!!

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ యాక్షన్ హీరో  ప్రస్తుతం 'రత్నం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు విశాల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ ప్రియులందరికీ పండుగలా ఉంటుందని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు విశాల్ తెలిపారు.''రత్నం షూటింగ్ మొత్తం పూర్తయింది. దర్శకుడు హరి సర్ తో, డార్లింగ్ డిఓపి సుకుమార్ అండ్ మొత్తం యూనిట్ తో కలిసి మూడవసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. టుటికోరిన్, తిరుచ్చి, కారైకుడి, వెల్లూరు, తిరుపతి మరియు చెన్నై వంటి ప్రాంతాల్లో పూర్తి సానుకూల వాతావరణంలో పని చేయడం నాకొక మంచి జ్ఞాపకం. స్టోన్ బెంచర్స్ నిర్మాత కార్తీక్ అండ్ టీమ్ కి కృతజ్ఞతలు. డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలను విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది యాక్షన్ ప్రియులందరికీ పెద్ద పండుగలా ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూనే మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది సమ్మర్ ట్రీట్ కావచ్చు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. థాంక్యూ'' అని విశాల్ పోస్ట్ చేసారు.. ఈ సందర్భంగా డైరెక్టర్ హరి, సినిమాటోగ్రాఫర్ ఎమ్. సుకుమార్ లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 సమ్మర్ లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే 'రత్నం' సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''డిటెక్టివ్ 2'' మూవీ మీద విశాల్ ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా డీపీ చేంజ్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేసారు. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన 'డిటెక్టివ్' చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే దర్శక హీరోల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా డైరెక్టర్ ను తొలగించి, సీక్వెల్ కు విశాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: