వాయిదాల బాటలో.. ఆ మూడు సినిమాలు?
దేవర : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు 85 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. అందులో దేవర పార్ట్ వన్ ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించా.రు కానీ గ్రాఫిక్స్ పనులతో పాటు ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కల్కి2898AD : ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ తెలిపారు. కానీ ఇప్పుడు ఆ డేట్ న కూడా సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే ఉంటుంది. షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. దానికి తోడు కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
పుష్ప2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఒకవేళ ఈ సినిమాలు పోస్ట్ పోన్ అయితే ఆ ప్రభావం ఇతర సినిమాలపై అవకాశం ఉంది. అందుకే ఇతర సినిమా నిర్మాతలు కోరుకునేది ఏంటంటే, పుష్ప, కల్కి, దేవర నిర్మాతలు నిజంగా తమ సినిమాలను కనుక వాయిదా వేస్తే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత ముందే ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.