మోదీ బయోపిక్.. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో సినిమా ఇండస్ట్రీ లో బయోపిక్  హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవితల కథ ఆధారం గా ఇక బయోపిక్లను తెరకెక్కిస్తూ ఉన్నారు ఎంతో మంది దర్శక నిర్మాతలు. అయితే కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. ఇక  సెలబ్రిటీలకు సంబంధించిన బయోపిక్లు కావడంతో ప్రమోషన్స్ లేకుండానే మంచి బజ్ ఏర్పడుతూ ఉండడం తో ఇలాంటి సినిమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో బయోపిక్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే భారత ప్రధాన మంత్రిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ ఇక భారత్లో ఎన్నో అనుహ్యమైనా సంస్కరణలకు కారణమయ్యారు. అయితే ఇలా మోడీ గొప్పతనాన్ని చూపించే విధంగా ఇక ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ తెరకేక్కెందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వార్త కాస్త  ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక త్వరలోనే ఇక మోడీ బయోపిక్ పట్టాలెక్క పోతుంది అన్నది తెలుస్తుంది. సిహెచ్ క్రాంతి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట.

 అయితే గత కొంతకాలం నుంచి మోడీ బయోపిక్ తెరకెక్కపోతుంది అని వార్తలు వచ్చినప్పటికీ.. అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇక మోడీ బయోపిక్ కి 'విశ్వ నేత' అనే టైటిల్ను ఖరారు చేశారు అనేది తెలుస్తుంది. వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కాశిరెడ్డి శరత్ రెడ్డి ఇక ఈ మూవీలో నిర్మించబోతున్నారట. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు అన్నది తెలుస్తుంది. కాగా ఈ మూవీలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ కేర్, పల్లవి జోషి ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: