డిజిటల్ స్ట్రీమింగ్ కు లైన్ క్లియర్ చేసుకున్న 'యానిమల్ 'మూవీ...!!

murali krishna
యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం సెన్సేషన్ హిట్ కొట్టింది.డిసెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‍లో వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా యానిమల్ రిలీజ్ అయింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఎన్ని విమర్శలు వచ్చినా.. కమర్షియల్‍గా మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. యానిమల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో కోర్టులో ఓ కేసు నమోదైంది.యానిమల్ సినిమా విషయంలో తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని టీ సిరీస్ చెల్లించలేదని ఢిల్లీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది సినీ1 స్టూడియోస్. అయితే, తాజాగా ఈ రెండు నిర్మాణ సంస్థలు ఈ వివాదాన్ని సద్దుమణిగించాయి. తాము ఈ ఆర్థిక వివాదాన్ని సెటిల్ చేసుకున్నామని నేడు కోర్టుకు తెలిపాయి టీ-సిరీస్ (క్యాసెట్స్ ఇండస్ట్రీస్), సినీ1 స్టూడియోస్. దీంతో యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్‍కు మార్గం సుగమమైంది.
ఒప్పందం ప్రకారం తమకు యానిమల్ సినిమా లాభాల్లో టీ-సిరీస్ వాటా ఇవ్వలేదని, అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును సీ1 స్టూడియోస్ ఆశ్రయించింది. దీంతో టీ-సిరీస్‍తో పాటు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. ఈ కేసు నేడు (జనవరి 22) విచారణకు రాగా.. తాము వివాదాన్ని సెటిల్ చేసుకున్నట్టు టీ-సిరీస్, సినీ1 స్టూడియోస్ కోర్టుకు తెలిపాయి. దీంతో ఈ వివాదం ముగిసినట్టయింది.యానిమల్ సినిమా జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. వివాదం ఉండటంతో ఆలస్యమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు వివాదం సద్దుమణగటంతో అనుకున్న సమయానికి జనవరి 26న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యానిమల్ సినిమా ఓటీటీ వెర్షన్.. థియేటర్లతో పోలిస్తే సుమారు 8 నిమిషాలు ఎక్కువ ఉండనుంది. సుమారు 3 గంటల 30 నిమిషాల రన్‍టైమ్‍తో ఓటీటీలోకి యానిమల్ రానుంది. థియేటర్ వెర్షన్ కోసం కట్ చేసిన సుమారు 8 నిమిషాల సీన్లలను ఓటీటీ వెర్షన్‍లో యాడ్ చేయనున్నట్టు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గతంలోనే ప్రకటించారు.యానిమల్ మూవీలో హీరో రణ్‍బీర్ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‍గా చేశారు. బాబీ డియోల్ విలన్‍గా నటించారు. రణ్‍బీర్ తండ్రి పాత్రను సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ చేశారు. రణ్‍బీర్‌తో తృప్తి డిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయింది. బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, మధు రాజా, సురేశ్ ఒబెరాయ్ కూడా ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.యానిమల్ సినిమాను టీ-సిరీస్, సినీ1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్‍బాస్టర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: