దేవరకు కూడా సలార్ లాంటి పరిస్థితి ఖాయం?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో 'దేవర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత జూనియర్ నుంచి రిలీజ్ అవుతోన్న తొలి సోలో పాన్ ఇండియా మూవీ కావడంతో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.ఎన్టీఆర్ లుక్..కంటెంట్ అందులో పాత్రలు ఎలా ఉంటాయి అన్నది కొరటాల ముందుగానే రివీల్ చేసేసారు. కొరటాల మాస్ మార్క్ ని మించి ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాతో సరికొత్త కొరాటాలని చూస్తామని తెలుస్తుంది. అటు 'వార్ -2' మూవీతో యంగ్ టైగర్ బాలీవుడ్ లోనూ లాంచ్ అవ్వడం అన్నది 'దేవర'కి కలిసొచ్చిన అంశంగా కలిసొస్తుంది. ఇలాంటి అంచనాల మధ్య హిందీలో కూడా సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్ప టికే పాన్ ఇండియా రేంజ్ లో ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఎటువంటి అడ్డంకులు లేకుండా అదే తేదికి రిలీజ్ అవ్వడం ఖాయం.ఇప్పటికే సినిమా షూటింగ్  85 శాతం పూర్తయింది. దీంతో ప్రకటించిన తేదీకి దేవర సినిమా రావడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఇద్దరు బాలీవుడ్ హీరోలు దేవరకి పోటీగా దిగుతున్నారు.



బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి 'బడేమియా చోటే మియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు చాలా భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 9 లేదా 10 తేదీల్లో రిలీజ్ కానుందని సమాచారం. దీంతో దేవర- బడేడియా చోటే మియా మధ్య కేవలం నాలుగు రోజుల గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇది హిందీ మార్కెట్ లో దేవర సినిమాపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.సలార్ ఇంకా డంకి సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్నివేశం కనిపించిందో అందరికి తెలిసిందే. 1000 కోట్లు రాబట్టాల్సిన ప్రభాస్ సినిమా కేవలం 600 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అది కూడా డే 1 బ్లాక్ బస్టర్ టాక్ అండ్ రికార్డ్ ఓపెనింగ్స్ తో. నార్త్ లో 'సలార్' వసూళ్లు ఇంత వీక్ గా ఉండటానికి కారణం డంకీ రిలీజ్. ఇప్పుడదే పరిస్థితి ఎన్టీఆర్ కి రావచ్చు. ఒకవేళ బాలీవుడ్ లో అక్షయ్ సినిమా గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే దేవర కూడా మరో సలార్ లా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: