అలాంటి సినిమాలకు శ్రీలీలా అయితేనే బెస్ట్..!!

Anilkumar
శ్రీలీల మొదటి సినిమాతోనే అందం అభినయంతో పాటు అదిరిపోయే డాన్సులతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన 'ధమాకా' సినిమాతో లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. ధమాకా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అలా గత ఏడాది ఏకంగా అరడజనుకి పైగా సినిమాలు చేసింది. కానీ వాటిలో ఎక్కువ శాతం అపజయాలు అందుకోవడం, ఆమె నటించిన సినిమాల్లో అన్ని ఒకే తరహా పాత్రలు చేయడం, ఆడియన్స్ కి విసుగు తెప్పించింది. 

దానికి తోడు ఏ ఈవెంట్ లో చూసిన ఆమేనే కనిపించడంతో సినీ జనాలకు బోర్ కొట్టేసింది. కానీ ఏ మాటకు ఆ మాట కమర్షియల్ సినిమాలకు శ్రీ లీల పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు శ్రీ లీల స్క్రిప్ట్ సెలక్షన్ లో తప్పు చేస్తుందని ఆమెను కొంతమంది విమర్శించారు. అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో శ్రీలీలా నటించిన సినిమాల్లో ఆమెకి స్ట్రాంగ్ క్యారెక్టర్రైజేషన్ లేదు. కానీ కమర్షియల్ సినిమాలకు ఎప్పటికీ ప్లస్ గా మారే మాస్ సాంగ్స్, డాన్సులు చేయడంలో ఆమెను చూసి హీరోలు కూడా స్వయంగా ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమె ప్రజెన్స్ మాస్ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది.

 అలా చూసుకుంటే ధమాకా సినిమా విజయానికి పాటలు, డాన్సులు ప్రధాన కారణం. ఆ తర్వాత 'స్కంద' లో కూడా మాస్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో మాస్ డాన్స్ నెంబర్స్ ఉన్నప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ రొటీన్ అయిపోవడంతో పాటలు కూడా కాపాడలేకపోయాయి. ఇక ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుంటూరు కారం' సినిమాలో కుర్చీ మడతపెట్టి మాస్ నంబర్ పెద్ద సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీలా డాన్సులు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: