డైరెక్టర్ త్రివిక్రమ్.. స్నేహితుడు సునీల్ ని తొక్కేస్తున్నాడా?

praveen
సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న ఎంతోమంది మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరి మధ్య స్నేహానికి కేవలం సినిమా మాత్రమే కాదు చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం కూడా కారణం అని చెప్పాలి. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వారిలో నటుడు సునీల్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఉన్నారు అని చెప్పాలి. అప్పట్లో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఒకే రూమ్ లో ఉంటూ ఒకరి కష్టాలను మరొకరు షేర్ చేసుకోవడం.. డబ్బులు ఉన్నప్పుడు తినడం లేనప్పుడు పస్తులు ఉండడం లాంటివి కలిసే చేశారు సునీల్, త్రివిక్రమ్.

 అయితే ఈ ఇద్దరు ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మరొకరు ఆదుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్గా ఎదిగిన త్రివిక్రమ్ తన సినిమాల్లో సునీల్ కోసం ఎప్పటి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రాసుకుంటూనే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇలా తన స్నేహితుడు సునీల్ ని మంచి నటుడిగా నిలబెట్టడంలో త్రివిక్రమ్ ఇక ఎంతగానో కృషి చేశాడు అనడంలో సందేహం లేదు. అయితే మధ్యలో హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో మళ్ళీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉన్నాడు.

 ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఏకంగా సునీల్ ని పూర్తిగా పక్కన పెట్టేసాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ సునీల్ ని ఎంతో డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ ఉంటే త్రివిక్రమ్ మాత్రం తనకోసం ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ని సృష్టించి ఐదు పది నిమిషాల క్యారెక్టర్  ఇస్తున్నాడు తప్ప ఇక సునీల్ కి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికే సునీల్ ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రను చేసి మెప్పించాడు. వైవిద్యమైన పాత్రల్లో నటించాడు. దీంతో సునీల్ ఏకంగా నటుడిగా మరో మెట్టు పైకెక్కిన త్రివిక్రమ్ మాత్రం అతని కోసం చిన్న క్యారెక్టర్లే రాస్తున్నాడని.. తన స్నేహితున్ని నటుడిగా మరింత నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేయడం లేదని.. ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. మరి త్రివిక్రమ్ రాబోయే సినిమాలలో అయినా సునీల్ కి మంచి క్యారెక్టర్ ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: