ప్రభాస్ 'కల్కి'లో విజయ్ దేవరకొండ.. నాగ్ అశ్విన్ భలే ప్లాన్ చేశాడుగా?

praveen
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. అయితే ఎందుకో అటు ప్రభాస్ నటించిన సినిమాలు మాత్రం సూపర్ హిట్ లో సాధించలేకపోతున్నాయి. అయితే దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల సలార్ అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన జోరులో ఉన్న ప్రభాస్ ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే సినిమాను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చేరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి.

 సాధారణంగా దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్ లో సినిమా రాబోతుంది అంటే ఇక సినిమాలో ఏదో ఒక కొత్త ధనం ఉంటుంది అని ప్రేక్షకులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినా తన డైరెక్షన్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో కల్కి 2898 అనే సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నాడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాల నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా లోకనాయకుడు కమలహాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
 దీంతోపాటు అమితాబచ్చన్, దిశా పఠాణి లాంటి స్టార్స్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ మూవీకి సంబంధించి ఇక ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా భాగమైనట్లు సమాచారం. ఏకంగా ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట  విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ తన నటనతో మెప్పించి హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాలోని కీలకపాత్రలో కనిపించి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: