నా జోలికి వస్తే.. దూల తీర్చేస్తా.. శివాజీ స్ట్రాంగ్ వార్నింగ్?

praveen
ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శివాజీ ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఇతర స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఇక ఇండస్ట్రీకి ఆయన పూర్తిగా దూరమైపోయారు. ఈ క్రమంలోనే ఇక శివాజీ గురించి అందరూ మర్చిపోయిన సమయంలో బిగ్బాస్ షోలో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచారు అని చెప్పాలి. ఇక ఈ షోలో తన ఆట తీరతో ప్రేక్షకుల హృదయాలను గెలిచేసాడు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శివాజీ నటించిన ఒక వెబ్ సిరీస్ ఇటీవలే విడుదలైంది. ఇక ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా పాత రోజుల్లోకి తీసుకువెళ్తుంది ఈ సిరీస్. అయితే ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగానే ఉన్నాడు శివాజీ. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీకి తన పొలిటికల్ కెరియర్ గురించి ఒక ప్రశ్న ఎదురవ్వగా.. షాకింగ్ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందా లేదా యాక్టింగ్ ని కొనసాగిస్తారా అంటూ జర్నలిస్టులు ప్రశ్నించారు.

 అయితే తాను ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ల లేదని శివాజీ చెప్పుకొచ్చాడు. సమైక్యరాష్ట్రం కోసం ఎప్పుడు పోరాడలేదని.. కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాత్రమే పోరాడాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల నాయకులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. నేను ఎంతో సంతోషంగా ఉన్నా. అయితే నాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు. నా ఫ్యామిలీ కోరిక మేరకు ఇక యాక్టింగ్ లోనే ఉంటా. కానీ ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వారి గొంతుకగా ఉంటా. నన్ను కావాలని ఎవరైనా పార్టీకి అంటగడితే.. ఆ పార్టీలోకి వెళ్లి మరి దూల తీర్చేస్తా.. నేను నిజాలు మాట్లాడతాను రాజకీయాలకు సెట్ కాను అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: