ఆ కారణం గా ఏడ్చేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న....!!

murali krishna
స్టార్ హీరోయిన్ రష్మిక యానిమల్ సినిమా సక్సెస్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. పుష్ప ది రూల్ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని రష్మిక నమ్ముతున్నారు.తాజాగా ఒక సందర్భంలో రష్మిక యానిమల్ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఘటనను పంచుకున్నారు. యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ ను చెంపదెబ్బ కొట్టే సీన్ ను ఒకే టేక్ లో పూర్తి చేశామని రష్మిక పేర్కొన్నారు.ఆ సీన్ లో నటిస్తున్న సమయంలో నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదని రష్మిక చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితి వస్తే ఒక భార్య ఎలా ఫీలవుతుందో అలానే రియాక్ట్ కావాలని డైరెక్టర్ నాకు చెప్పారని నాకు ఆ సీన్ లో యాక్ట్ చేసే సమయంలో డైరెక్టర్ చెప్పింది మాత్రమే గుర్తుందని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు. యాక్షన్ కట్ తప్ప మధ్యలో జరిగిందేదీ నాకు గుర్తు లేదని రష్మిక కామెంట్లు చేశారు. ఒక సీన్ లో భాగంగా రణ్ బీర్ ను చెంపదెబ్బ కొట్టడంతో ఆ తర్వాత గట్టిగా ఏడవటంతో పాటు అరిచేశానని రష్మిక వెల్లడించారు. ఆ తర్వాత రణ్ బీర్ దగ్గరకు వెళ్లి అంతా ఓకేనా అని అడిగానని ఆమె పేర్కొన్నారు. సినిమాలో ఆ సీన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుందని రష్మిక అన్నారు. రష్మిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం రష్మిక మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప ది రూల్ మూవీ ప్రేక్షకుల ఊహలను మించి ఉండబోతుందని ఆమె చెప్పుకొచ్చారు. పుష్ప ది రైజ్ మూవీ సక్సెస్ తో మాపై బాధ్యత పెరిగిందని రష్మిక చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: