మహేష్ సినిమాని పూర్తిగా తొక్కేసిన 'హనుమాన్'....!!

murali krishna
సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల కాగా మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.అయితే జనవరి 12వ తేదీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో పాటు చిన్న హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా హనుమాన్ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విడుదలకు పెద్ద ఎత్తున థియేటర్లు మాత్రం కేటాయించలేదు.
ఇక ఆంధ్ర తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం సినిమాకే ఎక్కువగా థియేటర్ లు కేటాయించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయితే హనుమాన్ సినిమాతో పోలిస్తే గుంటూరు కారం సినిమాకు కలెక్షన్ల పరంగా అలాగే టాక్ పరంగా కూడా కాస్త తక్కువే అని చెప్పాలి. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నార్త్ అమెరికాలో మాత్రం ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మహేష్ బాబు రికార్డులను కూడా హనుమాన్ సినిమా తొక్కేసిందని చెప్పాలి.
  నార్త్ అమెరికాలో హనుమాన్ సినిమా 360 లోకేషన్లలో విడుదల అయిన 325,459 రూపాయల కలెక్షన్స్ సాధించింది.ఇక గుంటూరు కారం సినిమా 388 లోకేషన్లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమాకు 319,071 కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టాయి. ఇక్కడ గుంటూరు కారం సినిమా కంటే హనుమాన్ సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. ఇలా ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో పలువురు గుంటూరు కారం సినిమాపై కామెంట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఇక్కడ ఇంతేనా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం గుంటూరు కారం ఘాటును హనుమాన్ సినిమా పూర్తిగా తగ్గించేసిందని కలెక్షన్ల పరంగా హనుమాన్ సినిమా మహేష్ సినిమాని పూర్తిగా తొక్కేసింది అంటూ కామెంట్లో చేస్తున్నారు.  ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా హనుమాన్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మొత్తంలో థియేటర్లను కేటాయించారు దీంతో మరికొన్ని థియేటర్లను పెంచాలి అంటూ పలువురు ప్రేక్షకులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సైందవ్ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: