సలార్ సినిమా కోసం శ్రియా రెడ్డి హెవీ వర్కౌట్స్.. వీడియో వైరల్..!!
ఇందులో పృధ్విరాజ్ సుకుమార్ నటించిన పాత్ర వరదరాజమన్నాకు సోదరిగా నటించింది. సినిమా చూసిన తర్వాత ఈమె పాత్ర చాలామంది రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రతో పోలుస్తున్నారు.. అయితే సలార్ సినిమా షూటింగ్ సమయంలో తన డైలీ రొటీన్ వర్క్ ని తాజాగా శ్రీయా రెడ్డి షేర్ చేయడం జరిగింది.. పుష్యప్స్ చేస్తూ వీడియోలను పోస్ట్ షేర్ చేసిన ఈమె షూటింగ్ సమయంలో తాను చికెన్ తందూరితోపాటు క్యారెట్, టమోటా ,దోసకాయలు తింటున్నట్లుగా తెలియజేసింది. రాధా రామ గెటప్ లో కూడా వర్కౌట్ చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేయడం జరిగింది.
అయితే టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది .పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో కూడా నటిస్తున్నది. ఇందులో కూడా యాక్షన్స్ సన్నివేశాలు ఒదిగిపోయి నటిస్తున్నట్లు తెలుస్తోంది.. శ్రియా రెడ్డి జిమ్ హెవీ వర్క్ అవుట్ లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. సినిమా కోసం ఇంత కష్టపడింది కాబట్టే సలార్ సినిమాలో అంత పాత్ర బాగా పండిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా టాలీవుడ్ లో విశాల్ నటించిన పొగరు సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది శ్రీయా రెడ్డి. ఆ తర్వాత వివాహం చేసుకొని కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది మధ్యలో రెండు మూడు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది.