సంక్రాంతి విజేత పై ఆశలు పెంచుకున్న హీరోలు !
ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ తెలియడానికి కనీసం మూడు రోజులు పట్టే ఆస్కారం ఉన్నప్పటికీ ఎవరి అంచనాలలో వారు ఉన్నారు. ఇక ఈరోజు విడుదల అవుతున్న ‘గుంటూరు కారం’ మ్యానియా టాప్ లో కొనసాగుతోంది. ఒక అంచనా ప్రకారం ఈసినిమాకు సంబంధించి సుమారు 8 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు అమ్మకం జరిగాయి అని వస్తున్న వార్తలు చాలమండికి షాక్ ఇస్తున్నాయి.
హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ధియేటర్ లోని అన్ని స్క్రీన్స్ కలుపుకుని 40 షోలకు పైగా ఈసినిమా మొట్టమొదటిరోజు షోలు వేస్తున్నారు అంటే ఈసినిమా మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఈమూవీ తరువాత క్రేజ్ విషయంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న మూవీ ‘హనుమాన్’ ఈసినిమాకు కూడ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో మంచి స్పందన కనిపిస్తోంది.
ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సంక్రాంతి రేస్ లో ఈరెండు సినిమాలు ప్రధమ ద్వితీయ స్థానాలలో పరుగులు తీస్తూ ఉంటే ఈ రేస్ లోకి ఎంటర్ అవుతున్న వెంకటేష్ నాగార్జునలలో ఎవరు సైలెంట్ కిల్లర్ అవుతారు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. శనివారం రాబోతున్న ‘సైంధవ్’ సౌండ్ చేయకుండా సైలెంట్ కిల్లర్ అవుతుందని వెంకటేష్ చాల నమ్మకంగా ఉన్నాడు. భోగి పండుగ రోజున రాబోతున్న ‘నాసామిరంగ’ ప్రమోషన్ నాగ్ ఒక రేంజ్ లో చేస్తున్నాడు. ఈనాలుగు సినిమాలు దేనికవే విభిన్నమైన జానర్లు కావడంతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులు ఈ నాలుగు సినిమాలు చూస్తారు అన్న అంచనాలతో ఈమూవీ బయ్యర్లు ఉన్నారు..