ఏంటి.. మహేష్ బాబు కి ఎడమ కన్ను కనిపించదా..!?

Anilkumar
ఏంటి మహేష్ బాబుకి ఎడమ కన్ను కనిపించదా..  ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎలా దాచారు.. ఇన్ని రోజులు ఈ విషయం చాలామందికి తెలియదు అని అనుకున్నారు.. కానీ ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజెన్లు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నిజంగానే మహేష్ బాబుకి ఎడమ కన్ను కనిపించదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎలా దాచి పెట్టారో అని ఆలోచిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక మహేష్ బాబుకి ఎడమ కన్ను కనిపించదు అని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా  


ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు తెరపైకి రావడానికి ముఖ్య కారణం మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల 24 గంటలవుతున్న నేపథ్యంలో మిలియన్ల వ్యూస్ అందుకుంటుంది. ఈ సినిమా జనవరి 12 విడుదల కాబోతోంది. ట్రైలర్ చూసిన చాలామందికి సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్ లోనే సినిమాపై హైప్ పెంచారు త్రివిక్రమ్.


ఇక మరోసారి ఈ సినిమాతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నారు అని ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొంతమంది నెటిజెన్లు మహేష్ బాబుకి ఈ సినిమాలో ఎడమ కన్ను కనిపించదా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే నిన్న విడుదలైన గుంటూరు కారం ట్రైలర్లో కుడి కన్నుపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాగే ట్రైలర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు కంట్లో నిప్పురవ్వ పడడం వంటివి గమనించే ఉంటారు. అయితే చాలామంది నెటిజన్స్ ఈ ట్రైలర్ చూసి మహేష్ బాబుకి ఈ సినిమాలో ఎడమ కన్ను కనిపించదని,అలాగే మహేష్ బాబుకి మోనోక్యులర్ విజన్ అంటే రెండు కండ్లకు వేరు వేరు విజన్లు ఉంటాయి అని కామెంట్లు పెడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: