ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన గుంటూరు కారం ట్రైలర్?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్‌లో ఇంకా దుమ్మురేపుతోంది. కేవలం పన్నెండు గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 39 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సౌత్ సినిమాగా నిలిచింది. ఇంతకముందు ఈ రికార్డ్ సలార్ సినిమాకి (32 మిలియన్ వ్యూస్) ఉండగా ఇప్పుడు ఆ రికార్డుని గుంటూరు కారం బద్దలు కొట్టింది.ఇంకా యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నంబర్ వన్ గా నిలిచింది.ఈ ట్రైలర్ కోసం చాలా గంటల పాటు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చారు మేకర్స్. సోషల్ మీడియా వాల్స్ పై ట్రైలర్ ను రీషేర్ చేస్తూ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. మహేశ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మ్యానరిజం అదిరిపోయాయని చెబుతున్నారు. మహేశ్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన పోకిరి టైప్ ఎలివేషన్లు వేరే లెవెల్ అన్ని అంటున్నారు.



మొత్తానికి ట్రైలర్ రిలీజ్ లో కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఉందని కూడా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఫుల్ శాటిస్ఫై అయ్యామని కామెంట్లు కూడా పెడుతున్నారు. కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా రివీల్ చేయకపోవడంతో సినిమాకు ప్లస్ పాయింటేనని అంటున్నారు.ఇక ట్రైలర్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఫలితం తేలేది మాత్రం సినిమా రిలీజయ్యాకే. సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో థియేటర్లలో జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. మరో రోజులో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయని సమాచారం. డిస్ట్రిబ్యుూటర్స్ అందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా, హిట్ ఫేమ్ మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. అయితే మహేశ్ సినిమాలకు ట్రైలర్, టీజర్ టాక్ తో పని ఉండదు. బొమ్మ పడ్డాక కంటెంట్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: