సోషల్ మీడియాలో దూసుకుపోతున్న గోపీచంద్ 'భీమా' టీజర్..!!

Anilkumar
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమా'. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మళ్లీ ఖాకీ డ్రెస్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ ఈరోజు టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 

సుమారు నిమిషం నిడివి తో ఉన్న ఈ టీజర్ లో గోపీచంద్ ఇంట్రడక్షన్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. 'యధా యధా ధర్మస్య' అనే శ్లోకంతో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్ లో గోపీచంద్ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. జస్ట్ చిన్న టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. 'రాక్షసులను వెంటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు' అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే డైలాగ్ తో గోపీచంద్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఖాకీ డ్రెస్ లో గోపీచంద్ దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. టీజర్ లో గోపీచంద్ లుక్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

 పోలీస్ డ్రెస్ లో గోపీచంద్ యాక్షన్ అంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ టీజర్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇదే టీజర్ లో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 16న సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బానర్పై కేకే రాధామోహన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. రవి బస్సుర్ సంగీతం అందిస్తున్నారు. స్వామీ జీ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వెంకట్, డాక్టర్ రవి వర్మ ఫైట్స్ అందించనున్నారు. మరోవైపు ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: