"గీతాంజలి 2" నుండి సునీల్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సునీల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సునీల్ ఆ తర్వాత హీరో గా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన అందాల రాముడు , మర్యాద రామన్న , పూల రంగడు అనే సినిమాలతో అద్భుతమైన విజయాలను హీరో గా అందుకున్నాడు.
 


ఈ మూడు మూవీ ల సక్సెస్ లతో వరుసగా సినిమాల్లో హీరోగా నటించిన సునీల్ కు హీరోగా మాత్రం పెద్ద విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అలా చాలా సంవత్సరాల పాటు హీరో గా వరుస అపజయాలను ఎదుర్కొన్న ఈయన మళ్లీ కామెడీ పాత్రల్లో , విలన్ పాత్రల్లో , సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం సునీల్ పుష్ప పార్ట్ 1 లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో సునీల్ తన సూపర్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సునీల్ కు ప్రస్తుతం ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు కూడా దక్కుతున్నాయి. 


ఇకపోతే తాజాగా ఈయన గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో సునీల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈయన ఈ సినిమాలో కిల్లర్ నాని పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా గీతాంజలి పార్ట్ 2 మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ లో సునీల్ చేతిలో ఓ హాకీ స్టిక్ పట్టుకొని క్రూరమైన లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: