చిరు - శ్రీదేవి కాంబోలో రావాల్సిన మూవీ.. ఆ కారణంతో ఆగిపోయిందా?

praveen
మెగాస్టార్ చిరంజీవి దివంగత నటి శ్రీదేవి కాంబో అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా. ఇక ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది అని చెప్పాలి. అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా చిరు, శ్రీదేవి కాంబో ఫేవరెట్ జోడిగా మార్చేసింది. ఈ మూవీ ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు కూడా వచ్చి సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పాలి. అయితే ఒక సినిమా మాత్రం వీరిద్దరి కాంబోలో రావాల్సి ఉండగా విచిత్ర కారణంగా చివరికి ఆగిపోయిందట.

 శ్రీదేవి సొంత నిర్మాణ సంస్థ అయిన లతా ప్రొడక్షన్స్ లో 35 ఏళ్ల క్రితం మొదలైన సినిమా ఇలా ఆగిపోయిందట. హిందీలో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ తెలుగులో సొంతంగా నిర్మించి సినిమాలు చేయాలనుకున్నారు శ్రీదేవి. తన చెల్లెలు శ్రీలత పేరు మీద లతా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. మౌనరాగం చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ స్ఫూర్తితో యండమూరి వీరేంద్రనాథ్ కథ తయారు చేయగా.. మంచి పాటలతో మ్యూజిక్ లవ్ స్టోరీ చేయాలన్నది శ్రీదేవి ఆలోచన. అయితే అప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే ఈ ప్రాజెక్టుకు హైప్ వస్తుందని శ్రీదేవి చిరంజీవిని కలవడానికి వెళ్లారట.

 చిరంజీవి కూడా కథ విన్నాక ఓకే చెప్పారట. ఇక ఏవీఎం స్టూడియోలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జిఆర్, కమల్ హాసన్, రాధిక లాంటివారు ఈ సినిమా ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. ముంబైలో ఒక పాట రికార్డింగ్ కూడా జరిగింది. అయితే సినిమా చిత్రికరణ సమయంలోనే ఎంతోమంది బయర్లు డైరెక్టర్ కోదండరామరెడ్డి దగ్గరికి వచ్చి అడిగారట. ఆ సమయంలో ఇక ఆ డైరెక్టర్కు ఓ సందేహం వచ్చిందట. చిరంజీవి, శ్రీదేవి చాలా కాలం తర్వాత కలిసిన నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అంచనాలను అందుకో లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే శ్రీదేవి దగ్గరకు వెళ్లి అమ్మ.. మనం ఎంచుకున్న కథపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏం చేద్దాం అని అడిగితే ఆమె కూడా కథలో మార్పులు చేయడానికి ఓకే అన్నారు. చిరంజీవితో ఒక మాట చెప్పి షూటింగ్ ఆపేశారు. చివరికి కథలొ ఎన్ని మార్పులు చేసినా సాటిస్ ఫై కావడంతో సరైన కథ లేక చివరికి శాశ్వతంగా ఈ సినిమాను ఆపేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: