సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'హనుమాన్'.. రన్ టైం ఎంతో తెలుసా?

Anilkumar
తేజ సజ్జా హీరోగా టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్' సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటివలే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్  సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో మేకర్స్ సినిమాకు సంబంధించిన పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. హనుమాన్ మూవీకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

అలాగే ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలుగా ఉండబోతోంది. కాగా హనుమాన్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చిరుత బారి నుంచి జింకను కాపాడి ఎత్తుకొని తేజ సజ్జా పరుగెత్తుతున్నట్టు ఈ పోస్టర్ ఉంది. తొలి ఇండియన్ సూపర్ హీరో ఫిలింగా హనుమాన్ రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ మూవీగా హనుమాన్ వస్తోంది. ఈ సూపర్ హీరో యునివర్స్ లో మొత్తంగా 12 సినిమాలు ఉంటాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. సినిమాలో తేజ సజ్జా హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు.

అతని సరసన అమృత హీరోయిన్గా నటిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సముద్ర ఖని కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి సుమారు రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు విదేశి భాషల్లో విడుదల చేయనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌడ, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: