అవును.. ఉగ్రం కథనే సలార్ పేరుతో తీసా.. ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్?
ఇక సలార్ మూవీ విడుదలైన తర్వాత ఉగ్రం సినిమా సలార్ సినిమా ఒకటే అంటూ ఇక ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. సలార్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ సినిమా ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం మూవీకి రీమేక్ అంటూ టాక్ మొదలైంది. అయితే ఈ విషయంపై అటు డైరెక్టర్ ప్రశాంత్ మాత్రం ఎప్పుడు స్పందించింది లేదు. దీంతో ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అని కొందరు.. రీమేక్ కాదని మరికొందరు కూడా కన్ఫ్యూషన్ లో ఉండిపోయారు అని చెప్పాలి. అయితే ఈ విషయంపై ఇటీవల ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు.
అందరూ అనుకుంటున్నట్లుగా ఉగ్రం కథ సలార్ కథ ఒకటి అంటూ స్పష్టం చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ రెండు సినిమాల కథ ఒకటి అయినప్పటికీ మేకింగ్ టేకింగ్ టెక్నికల్ వాల్యూస్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఉగ్రం మూవీకి సలార్ సినిమాకు చాలా డిఫరెంట్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. జస్ట్ ఆ కథలో సోల్ మాత్రమే తీసుకొని ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్థాయికి తగ్గట్టుగా కొత్త ట్రీట్మెంట్తో ఈ మూవిని రూపొందించినట్లు తెలిపాడు. ఇక ఎన్నో కథలు సిద్ధంగా ఉన్న సలార్ మూవీ కోసం ఉగ్రం కథను ఎంచుకోవడానికి రీసన్ ఏంటో కూడా చెప్పుకొచ్చాడు. ఉగ్రం సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశా. ఇక ఎన్నో ఏళ్ళు కష్టపడి సినిమాను రిలీజ్ చేశారూ ప్రశాంత్. పాజిటివ్ టాక్ వచ్చిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ సినిమా కథ బలం ఏంటో తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే మరోసారి అదే పాయింట్తో సలార్ సినిమాను రూపొందించారట ప్రశాంత్ నీల్.