పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి శ్రియ రెడ్డి..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తాత్కాలికంగా OG అనే టైటిల్ తో ముందుకు తీసుకు వెళుతున్నారు. కాగా ఇందులో కోలివుడ్ బ్యూటీ హీరోయిన్ శ్రియ రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక తాజా ఇంటర్వ్యూలో శ్రియ రెడ్డి OG లో తన పాత్ర మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పనిచేసిన అనుభవం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

దింతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఓ జి సెట్ లో పవన్ కళ్యాణ్ ని కలిసింత వరకు పవన్ కళ్యాణ్ గురించి తనకు ఎటువంటి ఆలోచన లేదు అని ఈ సందర్భంగా చెప్పింది. అంతేకాదు అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి నేను ఒకసారి గా షాక్ అయ్యాను అని చెప్పింది. ఇంతకీ క్రేజ్ ఏ నటుడు కి నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయనతో స్క్రీన్ చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది. OGలో తన పాత్రకు ఎలాంటి నెగటివ్ షేడ్స్ ఉండవని నటి చెప్పింది.

దర్శకుడు సుజీత్ అద్భుతమైన కథను రాశారు. అభిమానులతో కలిసి OG యొక్క ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చెప్పింది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. ఇక శ్రియా రెడ్డి ఈ జనరేషన్ వాళ్లకు  తెలియకపోవచ్చు. కానీ విశాల్ 'పొగరు' సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టిన అమ్మాయి అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేస్తుంది. తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్ గా సెటిల్ అయిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: