"ముఖ్యగమనిక" సింగిల్‌ రిలీజే చేసిన డైరెక్టర్ బాబీ

Chakravarthi Kalyan
అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా వస్తున్న సినిమా ముఖ్య గ‌మ‌నిక‌. లావ‌ణ్య హీరోయిన్ గా న‌టిస్తోంది. ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేసిన వేణు ముర‌ళిధ‌ర్.వి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన కార్యక్రమానికి డైరెక్టర్‌ బాబీ ముఖ్య అతిధి. ఆయన ముఖ్య గ‌మ‌నిక ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ఆ క‌న్నుల చూపుల్లోనా రిలీజ్ చేశారు.

ద‌ర్శకుడు బాబీ ఏమన్నారంటే.. `బ‌న్నీగారిని ఎప్పుడు క‌లిసినా  ఒక అబ్బాయి వ‌చ్చి తీసుకెళ్లి కూర్చోబెట్టడం..టీ, కాఫీల గురించి అడిగేవాడు.. విరాన్ అల్లు అర్జున్ బంధువు అని నాకు  తెలీదు.. చాలా ఏళ్ల త‌ర్వాత స‌డెన్ గా ఒక పోస్టర్ చూశా.. మ‌నోడిలా ఉన్నాడే అనుకున్నా.. రీసెంట్‌గా క‌లిసిన‌ప్పుడు ఈ ఈవెంట్‌కి మీరు రావాలి అని అన్నాడు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని..  వాళ్ల స‌హాయం తీసుకోలేదు. వారి ఆశీస్సులు మాత్రమే తీసుకుని ఇండిపెండెంట్‌గా ప్రయ‌త్నిస్తున్నాడు. ఇదే విరాన్ స‌క్సెస్‌కి పెద్ద పిల్లర్. సాంగ్ చూశాను. చాలా బాగుంది.

హీరో విరాన్ ఏమన్నారంటే.. - `బాబీ గారిని 2016లో అల్లు అర్హ పాప పుట్టిన‌ప్పుడు క‌లిశా. అప్పుడు నాకు `ప‌వ‌ర్‌`బాబీగానే తెలుసు. ఆ త‌ర్వాత బ‌న్నీగారి ఫంక్షన్‌లో క‌లిసిన‌ప్పుడు `జైల‌వ‌కుశ ద‌ర్శకుడిగా తెలుసు.. ఇప్పుడు 200 కోట్లు క‌లెక్ట్ చేసిన వాల్తేరు వీర‌య్య డైరెక్టర్‌గా తెలుసు.. ఆయన అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ వ‌చ్చారు. నేను ఫోన్ చేసి ఇలా సాంగ్ లాంచ్ అనుకుంటున్నాం మీరు రావాలి అన‌గానే ఎప్పుడు ఎక్కడ ఏ టైమ్‌కి అనే అడిగారు.. నిజంగా చెబుతున్నా ఇలాంటి మ‌నిషి నిజంగా ఇండ‌స్ట్రీలో లేరు.. ఆయన చాలా అరుదు.


దర్శకుడు వేణు ముర‌ళీధ‌ర్ ఏమన్నారంటే.. త‌ప్పు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చి ఆ ఆలోచ‌న‌ని సరిదిద్దుకునే లోపే కొన్ని అన‌ర్ధాలు జ‌రుగుతయనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేసిన సినిమా ఇది. మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్షన్ జ‌రుగుతోంది.. ఈ సినిమాకి విరాన్  దొర‌క‌డం మా అదృష్టం. ఈ అవ‌కాశమిచ్చిన నిర్మాత‌లకి రుణ‌ప‌డి ఉంటాను అన్నారు.

నిర్మాత రాజ‌శేఖ‌ర్‌ ఏమన్నారంటే.. ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వ‌చ్చిన బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. మా బేన‌ర్ శివిన్ ప్రొడ‌క్షన్స్‌లో వ‌స్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ మూవీ..త్వర‌లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో రెండు పాట‌లు ఉన్నాయి. రెండు అద్భుతంగా వ‌చ్చాయి. అన్నారు.

సంగీత ద‌ర్శకుడు కిర‌ణ్ ఏమన్నారంటే.. బిజీ షెడ్యూల్‌లోనూ మా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసిన బాబీ గారికి స్పెషల్ థ్యాంక్స్.. ద‌ర్శకుడు వేణు ఫ‌స్ట్ నుంచి గైడ్ చేస్తూ ఈ సినిమాకి అద్భుత‌మైన మ్యూజిక్ చేయించారు. ప్రస్తుతం మొద‌టిపాట విడుద‌లైంది ఎంత‌ వ‌ర‌కూ బాగుందో వారి నోటితోని వింటే బావుంటుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: