4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీలు ఇవే..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18.05 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది .
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.73 కలెక్షన్ లను వసూలు చేసింది .
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.65 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా విడుదల ఆయన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.06 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంటపురంలో సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.56 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.42 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.