ట్రోల్స్ పై రోషన్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Anilkumar
  యాంకర్ సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. రోషన్ కనకాల సరసన మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. 

డిసెంబర్ 29న ఈ సినిమాని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో బబుల్ గమ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ కి అడవి శేష్ విశ్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డ గెస్ట్లుగా వచ్చారు ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనపై వచ్చిన ట్రోల్స్ కి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు తనపై నల్లగా ఉన్నావని కామెంట్స్ వచ్చాయని చాలామంది ట్రోల్ చేశారని నల్లగా ఉన్నాడు వీలు హీరో ఏంటి అసలు వీడు ఈరో మెటీరియల్ కాదు అంటూ దారుణంగా మాట్లాడుకున్నారని స్వయంగా తన వెనకాలే మాట్లాడుకోవడం విన్నానని వెల్లడించిన రోషన్ కనకాల తన గురించి ట్రోల్ చేసిన వాళ్లందరికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్ కాదు 

ఇక్కడ టాలెంట్ ముఖ్యం నేను చాలాసార్లు విన్నాను నా వెనకాల మాట్లాడడం చూశాను చాలా ఆర్టికల్ చదివాను అరేయ్ వీడు హీరో ఏంటి? వీడేంటి మస్తు నల్లగా ఉన్నాడు వీడు హీరో మెటీరియల్ కాదు అని అన్నారు నేను ఇలానే పుట్టాను ఇలానే ఉంటా ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్ టాలెంట్ డిస్ప్లే మాత్రమే డిసైడ్ చేస్తుంది మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకుంటాను కావలసింది లాక్కొని తెచ్చుకుంటాం అది ఇజ్జత్ అయినా ఔకాద్ అయినా ఒకరోజు వస్తది వద్దనుకున్న వినబడతా చెవులు మూసుకున్న వినబడతా డిసెంబర్ 29న రాసి పెట్టుకోండి థియేటర్ కి వచ్చేయండి అని అన్నారు..


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: