ఇండియన్ లేటెస్ట్ సెన్సేషన్ సినిమాల్లో యానిమల్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వచ్చి నెల రోజులు అవ్వడానికి మరొక వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో మరొకసారి ఈ సినిమా టీం మొత్తం ఎడిటింగ్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎందుకు సినిమాలో మార్పులు చేస్తున్నారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. దియెటర్స్ లో చూసిన జనాలకు ఇంతకుమించి సినిమాను చూపించే ఛాన్స్ లేదు. అందుకే ఓటీటీ లో చూసే వారి కోసమైనా నెక్స్ట్ లెవెల్ యానిమల్ ను తీసుకు వస్తారు అని అంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు సీన్లను
సైతం జోడిస్తున్నట్లు గా సమాచారం అందుతుంది. ఎప్పటిలాగే థియేటర్లో వర్షన్ కోసం రాజీపడిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఓటీటీ లో మాత్రం తగ్గేదేలే అని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా త్వరలోనే రాబోతోంది. అందుకే సినిమాలో కొన్ని సీన్లు జోడించాలి అని ఇదే పని మీద మేకర్స్ కూర్చున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ఆసక్తికర సన్నివేశాలను ఇప్పుడు ఓటీటీ లో ప్రసారం చేయాలని చూస్తున్నారట. గతంలో చెప్పినట్లుగానే మిగిలిన 39 నిమిషాల సినిమాను ఇందులో యాడ్ చేస్తున్నారట. అంతేకాదు సెన్సార్ కి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు లేవు అని
అనుకున్న చాలా వరకు సన్నివేశాలను మాత్రమే ఇందులో యాడ్ చేస్తారట. 'యానిమల్' సినిమా అభిమానులకు ఇది పెద్ద నిరాశే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా టీమ్‌లో కొంతమంది ఇప్పటికే ఆ డిలీటెడ్ సీన్ల గురించి భారీ హైప్ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ ఇలా చాలామంది 'ఆ సీన్స్ కూడా ఉండుంటేనా? అదిరిపోయేది' అని చెప్పారు. కానీ ఏం చేస్తాం ఆ సీన్స్ ఓటీటీలో రావు. మరి యూట్యూబ్‌లో అయినా ఇస్తారేమో చూడాలి. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక థియేటర్స్ లో సినిమా మిస్ అయిన వారందరూ ఓటీటీ లో ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు..!!