ఈ సంవత్సరం అదిరిపోయే విజయాలతో కం బ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ... గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించగా ఇందులో ఆచార్య మూవీ ఫ్లాప్ కాగా ... గాడ్ ఫాదర్ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో చిరంజీవి "వాల్టేరు వీరయ్య" సినిమాతో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ కం బ్యాక్ ను ఇచ్చాడు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వరుస అపజాయలు రావడంతో కొంత కాలం సినిమాలకే దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను మొదటగా పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈయన జవాన్ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఈయన నటించిన డంకీ సినిమా విడుదల అయ్యి విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.
సూపర్ స్టార్ రజనీ కాంత్ గత కొంత కాలంగా వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం జైలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రజిని భారీ విజయాన్ని అందుకొని సూపర్ కం బ్యాక్ ఇచ్చాడు.
బాహుబలి సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస అపజయాల డీలా పడిపోయాడు. తాజాగా ఈయన సలార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే ఈ మూవీ తో ప్రభాస్ అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ ఇచ్చే విధంగానే కనబడుతున్నాడు.