సలార్ సినిమా ఆ హీరోకి హెల్ప్ అయ్యిందా..!!

Divya
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.హిందీ వర్షన్ లో నార్తు లో దుమ్ము దులిపేస్తోంది.ముఖ్యంగా సలార్ సినిమా మూడు రోజులు హాలిడేస్ కలిసి రావడంతో కలెక్షన్స్ సైతం 25 శాతానికి పైగా గ్రోత్ పెరిగినట్లు కనిపిస్తోంది.ఇదంతా ఇలా ఉండే మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నటించడం జరిగింది.
అయితే ఇందులో వరదరాజమన్నారు పాత్రలో కనిపించిన ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు సలార్ సినిమాకి ఉన్న ఆదరణ చూసి పృథ్వీరాజ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఇది ఒక విధంగా పృథ్వీరాజ్ కి ప్లస్ అని కూడా చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా ఉండే సినిమాలలో ఆడియన్స్ కి ఇతర పాత్రలను పట్టించుకోరు కానీ సలార్ సినిమాలో మాత్రం పృథ్విరాజ్ పాత్రకి మంచి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పృథ్విరాజ్ సుకుమార్ని కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఈ నటుడిని పరిచయం చేయడానికి మరింత హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు.
మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు.. మలయాళ సినిమాలను తెలుగు డబ్బింగ్ వర్షన్ లో ఓటీటి లో చూసిన కొన్ని వర్గాల ఆడియన్స్ కు మాత్రమే ఈ నటుడు తెలుసు ఇప్పుడు సలార్ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో హీరోగా మంచి ఆదరణ దక్కించుకున్నారు. రాబోయే రోజుల్లో పృథ్వీరాజ్ కు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది.. దీనికి తోడు పృథ్వీరాజ్ మలయాళ సినిమాలు ఇప్పటినుంచి తెలుగులో కూడా విడుదలవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: