బాలయ్య బాబు మూవీలో మలయాళ నటుడు....!!

frame బాలయ్య బాబు మూవీలో మలయాళ నటుడు....!!

murali krishna
బాలయ్య హీరోగా, బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఇప్పుడు ఈ సినిమా లో మరో స్టార్ కూడా ఆడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మమ్ముట్టి అయితే ఆ పాత్ర కు న్యాయం చేయగలడనే ఉద్దేశ్యం తోనే బాబి ఆయనని సంప్రదించిన ట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తానికి అదొక కీలక పాత్ర కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది...ఇక ఇప్పటికే బాబీ చిరంజీవి లాంటి స్టార్ హీరోకి వాల్తేరు వీరయ్య లాంటి సినిమా రూపంలో ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇక దాంతో బాలయ్య బాబు కి కూడా ఇప్పుడు ఒక మంచి హిట్ ఇస్తాడని నమ్మకం తోనే బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు మరి ఆయన ఈ సినిమా తో బాలయ్య కి సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక ముఖ్యంగా బాబీ సినిమా అంటే అందులో ఫైట్లు కీలకం గా మారుతాయి.   ఈ సినిమా లో కూడా బాలయ్య ని మరో రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది... ఇక బాలయ్య ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహ రెడ్డి భగవంత్ కేసరి అనే సినిమా లతో సూపర్ సక్సెస్ లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక వరుస గా మూడు విజయాలను అందుకున్న సీనియర్ హీరో గా కూడా బాలయ్య ఇప్పటికి ఒక హిస్టరీ ని క్రియేట్ చేశాడు. ఇక బాబీ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే బాలయ్య వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: