వెంకటేష్- నాగార్జున కాంబోలో మిస్ ఐనా మల్టీస్టారర్ మూవీ అదేనా....!!
వరుసకు వీళ్లిద్దరు బావ బామ్మర్దులు అవుతారు. ఎందుకంటే వెంకటేష్ సోదరి లక్ష్మి ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. అయితే కొన్ని కారణాల చేత నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి నుండి వెంకటేష్ మరియు నాగార్జున మధ్య మాటలు లేవు.మధ్యలో వీళ్లిద్దరు కలిసి మూడు మల్టీస్టార్రర్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చిందట. నాగార్జున మరియు సుమంత్ కాంబినేషన్ లో వచ్చిన 'స్నేహమంటే ఇదేరా' చిత్రం ముందుగా వెంకటేష్ మరియు నాగార్జున చెయ్యాల్సింది. వెంకటేష్ నటించడానికి సిద్ధం గానే ఉన్నప్పటికీ,నాగార్జున మాత్రం ఇష్టం చూపలేదు. చివరికి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న తన కుటుంబ సభ్యుడు సుమంత్ తో కలిసి చేసాడు. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ హౌస్ ఫుల్ చిత్రాన్ని నాగార్జున మరియు వెంకటేష్ కాంబినేషన్ లో చెయ్యాలని పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారు.కానీ నాగార్జున ఇందుకు కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికీ వీళ్లిద్దరు కలిసి మల్టీస్టార్రర్ సినిమాలు చేసే స్కోప్ చాలా ఉంది, కానీ చెయ్యరు. సీనియర్ హీరోలలో ఒకే రేంజ్ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేస్తే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వస్తాయి. వీళ్ళిద్దరిని కలిపే డైరెక్టర్ వస్తాడో రాడో చూడాలి.