సలార్ సక్సెస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ.. కారణం..?
సలార్ సినిమాకి ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు అయినప్పటికీ కూడా భారీ హైప్స్ తో ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇందులోని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో సలార్ సినిమాని పవర్ ప్యాక్ చేశారని ప్రశాంత్ నిల్ చెప్పవచ్చు. అయితే ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.. తన తదుపరి చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తోనే 31వ చిత్రం అనే టైటిల్ తో చేయబోతున్నారు.ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెట్స్ మీదికి వెళ్ళబోతోంది.
సరిగ్గా నాలుగు నెలలు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందట. అంతేకాకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా వస్తే ఆ చిత్రం కూడా భారీ కాంబినేషన్ కావడం చేత మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు #NtrNeel అనే ట్యాగ్ ను సైతం ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్టు అని ప్రశాంత్ గతంలో తెలియజేశారట. దీంతో ఈ సినిమా కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ షేక్ చేస్తుందని అభిమానులు సైతం చాలా ధీమాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.