వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ పార్ట్నర్ లాక్..!!

Anilkumar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకుని వైమానిక దాడి ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ కు హెడ్ గా కెప్టెన్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకుంటున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఈసారి సరికొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది.   

ఈ సినిమాతోనే ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. టెక్నికల్ గా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. వైమానిక దాడిని ప్రధాన అంశంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరిచే విధంగా ఉండబోతున్నాయి. అందుకు శాంపిల్ గా టీజర్ లో కొన్ని షాట్స్ చూపించారు. అంతేకాదు వైమానికి దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలను, దేశాన్ని కాపాడడంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఎవరో రివీల్ అయింది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని మేకర్స్ టీజర్ ద్వారా వెల్లడించారు. కాకా డిసెంబర్ నెలలోనే ఈ సినిమాని ముందుగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా రిలీజ్ ని పోస్ట్ ఫోన్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మూవీ థియేట్రికల్ పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: