బాలయ్య బాబు మూవీకి టైటిల్ ఎలా పెట్టారో తెలుసా....!!
అలా మొదలైన ఈ సినిమా నిర్మాణ పనులు చక చకా పూర్తయ్యాయి. మద్రాస్ ఏవీఎం స్టూడియోలో సాంగ్స్ రికార్డింగ్ జరిగింది. ఈ సినిమా కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందింది. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుందీ మూవీ.అరకులోయ ప్రకృతి అందాల నడుమ షూట్ చేసిన ఇందులోని పాటలు ఒక విజువల్ త్రీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు.అయితే ఈ చిత్రానికి టైటిల్ ఫైనలైజ్ చేసే రెస్పాన్సిబిలిటీని అప్పటి పాపులర్ సినీవీక్లీ మ్యాగజైన్ శివరంజనికి అప్పగించారు. అయితే ఈ మ్యాగజైన్ నిర్వాహకులు తమ సొంతంగా టైటిల్ పెట్టడం ఇష్టం లేక తమ పాఠకుల సలహాలను కోరింది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. వేలాది టైటిల్స్ సజెస్ట్ చేశారు.
చివరికి దర్శక నిర్మాతలకు అల్లరి కృష్ణయ్య అనే టైటిల్ బాగా నచ్చేసింది. ఈ టైటిల్‌ను సుమారు 300 మంది అభిమానులు సజెస్ట్ చేశారు. దాన్నే సినిమా టైటిల్ గా ఖరారు చేయాలని ఇక మూవీ మేకర్స్ కూడా నిర్ణయానికి వచ్చారు. అయితే మూవీ షూటింగ్ సమయంలో ఏవీఎం స్టూడియోలో లక్కీ డీప్ కండక్ట్ చేయగా.. బాలకృష్ణ డ్రా తీశాడు.అందులో విన్నర్‌గా పశ్చిమగోదావరి జిల్లా, పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన బి.ప్రకాష్ నిలిచాడు. కాగా నందమూరి రమేష్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్ పర్ఫామెన్స్ కనబరిచిన నిరాశపరిచింది. కానీ బాలయ్య ఫ్యాన్స్ టైటిల్ పెట్టిన సినిమాగా అల్లరి కృష్ణయ్య ప్రత్యేకంగా నిలిచిపోయింది.