11వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీలు ఇవే..!
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం గీత గోవిందం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... పరశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.21 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ , పరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన జాతి రత్నాలు మూవీ విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.67 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా మూవీ విడుదల అయిన 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.