నేను గుడ్ యాక్టర్ అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

Anilkumar
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న  అడివి శేష్ హీరో త్వరలోనే 'గూడచారి సీక్వెల్'(G2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అడవి శేష్ బర్త్డే కావడంతో విలేకరులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి. ముందుగా తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.." ప్రస్తుతం నేను చేస్తున్న 'G2'(గూఢచారి 2) ఐదు దేశాల్లో జరిగే కథ. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాం. అలాగే శృతిహాసన్ తో చేస్తున్న మూవీ కూడా హిందీ, తెలుగు భాషల్లో వేరువేరుగా షూట్ చేస్తున్నాం. 


నటీనటులను కూడా తెలుగు, హిందీ భాషల్లో మంచి పట్టు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం. నన్ను నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే దర్శకుడికి ఓర్పు చాలా అవసరం. నాకు అది లేదు. అందుకే నేను యాక్టింగ్, రైటింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తా. అది కూడా కేవలం నాకోసం. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక కేవలం నటుడు గానే మరో రెండు సినిమాలు చేయబోతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. ఆ తర్వాత శృతిహాసన్ తో చేస్తున్న ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు." శృతిహాసన్ తో చేసే సినిమా వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ. హైలీ ఎమోషనల్. 


న్యూ జానర్ ఫిలిం. డైరెక్టర్ షానిల్ డియో అద్భుతమైన ప్రతిభావంతుడు. నేను క్షణం మూవీ చేస్తున్న టైంలో అతను చేసిన షార్ట్ ఫిలిం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపికైందని తెలిసి షాక్ అయ్యాను. ఎలాగైనా అతన్ని డైరెక్టర్ గా పరిచయం చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" అంటూ చెప్పాడు. దీంతో అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా గత ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. ఇదే విషయం గురించి అడిగితే.." ఈ ఏడాది నా సినిమాలేవి విడుదల కాలేదనే బాధ నాకు లేదు అని తెలిపాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: